- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయనగరం జిల్లాకు జాతీయ అవార్డు
దిశ, విశాఖపట్నం: విజయనగరం జిల్లాకు జల సంరక్షణలో జాతీయ జల అవార్డు వరించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించిన 2వ జాతీయ జల అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతులమీదుగా వర్చువల్ విధానంలో విజయనగరం జిల్లాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు జిల్లా కలెక్టర్ విజయనగరం ప్రజలకు అంకితం చేశారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. జల సంరక్షణ ప్రతీ ఒక్క పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. మానవ మనుగడకు నీరే మూలాధారమని అన్నారు. మన జీవన విధానంలో జలసంరక్షణ ఒక భాగం కావాలని ఆయన కోరారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నీటి వనరుల సంరక్షణపై విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు, వ్యవసాయ కార్యక్రమాల విస్తరణ కారణంగా క్రమంగా నీటి వినియోగం కూడా పెరుగుతోందని చెప్పారు. 2050 నాటికి కేవలం త్రాగునీటి అవసరాలకే అందుబాటులో ఉన్న జలాల్లో సుమారు 18శాతం వినియోగింపబడుతుందని తెలిపారు. నీటి దుర్వినియోగాన్ని తగ్గించడం, నీటి పునర్ వినియోగాన్ని పెంచడం, జల సంరక్షణ చర్యలను భారీఎత్తున చేపట్టడం ద్వారా నీటి వనరులను భవిష్యత్ తరాలకోసం సంరక్షించవచ్చని సూచించారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు దేశవ్యాప్తంగా చర్యలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం మన విధి అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.