- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమ్మెకు తూట్లు పొడుస్తున్న సింగరేణి యాజమాన్యం
దిశ, గోదావరిఖని: సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్న కేంద్ర ప్రభుత్వానికి యాజమాన్యం అండగా నిలుస్తుందని జాతీయ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణిలో మూడు రోజుల సమ్మెలో భాగంగా రెండవ రోజు శుక్రవారం రాత్రి అడ్డదారిలో యాజమాన్యం ఓసీపీ 4 నుండి.. సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది, పోలీసుల అండతో బొగ్గు లారీలను సీఎస్ పీ-1 కు తరలించి అన్ లోడ్ చేయించారని.. సమ్మెను అడ్డుపెట్టుకొని బొగ్గు కుంభకోణానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. గతంలో ఓసీపీ-4 లో జరిగిన పలు కుంభకోణాలు మరువక ముందే సమ్మెను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు సెక్యూరిటీ సిబ్బందితో అడ్డదారిగా అక్రమాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారి విధులు నిర్వహించాలి తప్పా ఇతరుల విధులు నిర్వహించడం ఏమిటని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చెల్పూరి సతీష్, బత్తుల పోచం,శ్రావన్ కుమార్, జగన్, బండి మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
- Tags
- godavarikhani