- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మినీ ఇండియాలో ఎన్‌పీఆర్
ఏప్రిల్ మొదటి నుంచి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్)ను సిద్ధం చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోటిన్నర జనాభా ఉంటుందని అంచనా. మినీ ఇండియాగా పిలవబడే హైదరాబాద్‌లో ఎన్‌పీఆర్‌కు అవసరమైన వారసత్వ రికార్డులు ఉన్నాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. జనన, మరణ ధృవీకరణపత్రాలను ఆన్లైన్ చేస్తున్న బల్దియా వద్ద కూడా అసలు ఎంతమంది రిజిస్ట్రర్ అయ్యారంటే ఇతమిద్ధంగా మాత్రమే సమాధానం వస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం.. హైదరాబాద్ జనాభా కేవలం 68.1 లక్షలు మాత్రమే ఉన్నారు. గత తొమ్మిదేండ్ల కాలంలో ఈ సంఖ్య కోటిన్నర దాటి ఉంటుందని అధికారులే అంచనా వేస్తున్నారు. నగరంలో జీవించేవారిలో 70 శాతానికిపైగా ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చినవారే. జీహెచ్ఎంసీ కూడా గతంలోనే ఇక్కడ ప్రజల రికార్డులను ఆన్‌లైన్లో పొందురపర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జనన, మరణ రికార్డులను కూడా మెయింటెన్ చేస్తున్నారు. 2012 ఏప్రిల్ తర్వాత నుంచి ఆన్లైన్‌లో డెత్, బర్త్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంతోపాటు అంతకుముందు మ్యానువల్ రికార్డులను సైతం ఆన్లైన్ చేస్తున్నారు. సగటున రోజుకు 1,000 నుంచి 1,200 రికార్డులను ఆన్లైన్ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రోజుకు 80 నుంచి 100 పేర్లను (మరణించడం, ఇతర కారణాలతో) తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఇప్పటి వరకూ 27 నుంచి 30 లక్షలమందికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఆన్‌లైన్ చేసినట్టు అంచనా. జీహెచ్ఎంసీ అధికారుల వద్ద కూడా కచ్చితంగా ఎంతమంది బర్త్ సర్టిఫికెట్లు ఆన్లైన్ చేశామని సమాచారం దొరకడం లేదు. 2012 ఏప్రిల్ తర్వాత పుట్టినవారి వివరాలు స్పష్టంగా రికార్డుల్లో ఉన్నప్పటికీ వారి ముందు తరం వివరాలను మాత్రం కచ్చితంగా అందించే వ్యవస్థ ఏదీ ఇక్కడ లేదు.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ మాజిద్ హుస్సేన్ ఈ సమస్య గురించి మాట్లాడుతూ గ్రేటర్లో 30 శాతం జనాభా వద్ద మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. ఓ అంచనాతో చెప్పినప్పటికీ మిగిలిన 70 శాతం జనాభా వద్ద బర్త్ సర్టిఫికెట్లు లేవన్నది స్పష్టం.. విద్యార్హతలు కొద్దిగా ఉన్నవారు మినహా 1980కి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పుట్టిన అత్యధిక మందికి పుట్టినతేదీ కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి. ఆధార్ కార్డుల మంజూరు సమయంలో ఓ అంచనాతో వేశారు తప్ప ఎలాంటి ప్రభుత్వ రికార్డులను పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే చాలామంది ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ జనవరి 1 ఉండటం సాధారణమని ఓ పరిశీలకుడు వివరిస్తున్నారు.
బర్త్ సర్టిఫికెట్లు లేనివారు ‘అన్ అవేలబులిటీ‘ కింద దరఖాస్తు చేసుకుని బర్త్ సర్టిఫెకెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం, అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ఆఫీసు వరకూ వెళ్లాలి. కనీసం మూడు నెలల తర్వాత మాత్రమే ఈ ప్రక్రియలో బర్త్ సర్టిఫికెట్ మంజూరవుతుంది. ఎన్పీఆర్ కోసమని నగరంలోని ప్రజలంతా ఈ కార్యాలయాల చుట్టూ తిరగకతప్పదు. గరిష్టంగా 30 నుంచి 50 లక్షల మంది వరకైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అధికారులు ఈ పని తప్ప ఇంకోపని చేయకుండా పోతోంది.
ఎన్‌పీఆర్ కోసం అవసరమైన పత్రాలు ఇవ్వనివారిని డిటెన్షన్ సెంటర్లో ఉంచుతారని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. మూడు నెలల పట్టే ఈ ప్రక్రియను డిటెన్షన్ సెంటర్లో ఉండి ఎలా చేయగలుగుతారు. అలా అనుకున్నా బర్త్ సర్టిఫికెట్ ఉన్నవారు సైతం వారి తండ్రి, తాతల వారసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే 2012కు ముందు పుట్టినవారికి కనీసం బర్త్ సర్టిఫికెట్ కూడా లేని పరిస్థితుల్లో గ్రేటర్లో ఎన్పీఆర్‌ను ఎలా చేపట్టగలుగుతారు. మినీ ఇండియా అయిన హైదరాబాద్ ప్రజలతోపాటు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పెద్ద సవాల్‌గానే మారనుంది.
Read Also..