- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ మున్సిపాలిటీలకు జాతీయ స్థాయి అవార్డులు.. కేటీఆర్ ఖుషి
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పడిన తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అన్న భేదం లేకుండా సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకుపోతుందన్న మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణ అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టణాలకు ప్రత్యేక నిధులు కల్పించడంతోపాటు, ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలను తీసుకువచ్చామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులను అభినందించిన ఆయన వారందరితో ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశంమై మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకువచ్చిన అనేక వినూత్న కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ మరియు కృషితో పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పట్టణ పరిపాలనలో పీఎం స్వనిధి వంటి కార్యక్రమాల్లోనూ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలుస్తుందని అన్నారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో సఫాయి మిత్ర ద్వితీయ స్థానం అవార్డుతో పాటు మరో 11 స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను దక్కించుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ సిబ్బంది, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధుల నిబద్ధత కలిగిన కృషి, సమన్వయంతోనే ఇది సాధ్యమవుతున్నదని మంత్రి అన్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో స్వచ్ఛ అవార్డులు దక్కించుకున్న పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కూడా మరింత చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు రావడంతో పాటు, మంత్రి కేటీఆర్ తమకు ప్రత్యేక అభినందనలు తెలపడం పట్ల, పురపాలక సంఘాల ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి గారి నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో తమ పట్టణాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
- Tags
- minister Ktr