- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించిన నాసా
దిశ, వెబ్‌డెస్క్ : చందమామపై నీటి జాడ గురించి తెలిసినా.. ఇప్పటివరకు సూర్యకాంతి పడని ప్రాంతాల్లోనే నీరు ఉన్నట్లు తేలింది. అయితే తొలిసారిగా సూర్యకాంతి పడే ప్రాంతంలోనూ నీటి ఆనవాళ్లను నాసా గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లయింగ్ అబ్జర్వేటరీ అయిన సోఫియా (SOFIA) ద్వారా నాసా ఈ విషయాన్ని కనిపెట్టింది.
సూర్యకాంతి పడిన చోట నీరు ఉన్నట్టు నేచర్ ఆస్ట్రోనమీలో ప్రచురితమైన ఓ ఆర్టికల్ తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉండే క్లావియస్ పగులులోయ (CLAVIUS CRATER)లో సోఫియా ఈ నీటిని గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధృవంలో అతి పెద్ద లోయ ఇదే. గతంలో సూర్యరశ్మి పడని చోట నీరు కొంతవరకు ఉన్నట్టు భావించినప్పటికీ, సూర్య కాంతుల క్రేటర్లలోనూ వాటర్ ఉన్నట్లు హవాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్, ప్లానెటాలజీ రీసెర్చర్ కేసీ హానిబాల్ వెల్లడించారు. సోఫియాకు సంబంధించిన స్ట్రాటోస్పెరిక్ అబ్జర్వేటరీ నుంచి సేకరించిన డేటాను వినియోగించి, ఎయిర్ బోర్న్ టెలిస్కోప్ ద్వారా చంద్రుని ఉపరితలాన్ని తాము స్కాన్ చేసినట్టు హానిబాల్ వివరించారు. ఆ నీటిలో ఆక్సిజన్ ఉందని, దీన్ని మంచినీటిగానే గాక, రాకెట్ ఫ్యూయెల్‌గా కూడా వాడొచ్చునని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని హానిబాల్ పేర్కొన్నారు. ఎండపడే ప్రాంతాల్లోనూ నీరు ఉందని తేలడం శుభపరిణామంగా నాసా భావిస్తోంది. దీంతో వైపర్ అనే నీటిని పరిశోధించే రోవర్‌ను చంద్రుడిపైకి పంపాలని నాసా భావిస్తోంది. చంద్రుడుపైకి నాసా 2024లో ఆస్ట్రోనాట్లను పంపే ఆలోచనలో ఉండటంతో.. ఈ వార్త వారికి ఆశాజనకంగా మారింది. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ పార్టికల్స్ వల్ల నీరు ఏర్పడి ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.