మార్స్‌పై ‘పర్సెవరెన్స్’ టెస్ట్ డ్రైవ్ సక్సెస్

by Harish |
NASAs Perseverance rover
X

దిశ, ఫీచర్స్ : రెడ్ ప్లానెట్(అంగారకుడి)పై జీవాన్వేషణకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పంపిన పర్సెవరెన్స్ రోవర్ తన తొలి టెస్ట్ డ్రైవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిది. గత నెల 18న అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన ఈ రోవర్.. మిషన్‌లో భాగంగా అంగారకుడి ఉపరితలంపై 21.3 ఫీట్ల దూరాన్ని 33 నిమిషాల వ్యవధిలో ప్రయాణించింది. మొదట నాలుగు మీటర్ల దూరం ముందుకు ప్రయాణించి, ఆ తర్వాత 150 డిగ్రీ కోణంలో ఎడమ వైపునకు తిరిగి 2.5 మీటర్లు పయనించినట్లు నాసా పేర్కొంది.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, త్వరలోనే రోవర్ సాయంతో మరిన్ని విషయాలు కనుగొంటామని నాసా సైంటిస్టులు తెలిపారు. అంతేకాదు ఈ రోవర్ మార్స్‌పై తిరిగిన ఫొటోలను నాసా తన ట్వింటర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. కాగా మార్స్ 2020 మిషన్‌లో భాగంగా అంగారకుడిపైకి నాసా పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్, అక్కడి జీవావరణం ఎలా ఉంది కనుగొనడంతో పాటు మట్టి నమూనాలను భూమిపైకి పంపనుంది.

Advertisement

Next Story