- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టాలు ఇస్తారా.. ప్రాణాలు తీసుకోమంటారా?
దిశ, నారాయణపేట: మూడు తరాలుగా తాము భూములను సాగు చేస్తున్నా.. నేటికీ పట్టాలు ఇవ్వలేదని, వెంటనే పట్టాలు ఇస్తారా? లేక ప్రాణాలు తీసుకోమంటారా? అంటూ నారాయణపేట జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గురువారం దామరగిద్ద మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్ల పట్టుకొని నిరసన చేపట్టారు. వివరాళ్లోకి వెళితే… దామరగిద్ద మండలం కంసాన్‌పల్లి గ్రామ శివారులోని 1040 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన 350 కుటుంబాలు గత మూడు తరాల నుంచి సాగు చేస్తున్నారు.ఆ భూములను మండల రెవెన్యూ అధికారులు గురువారం సర్వే చేయడానికి గ్రామానికి చేరుకోగా వారిని అడ్డుకొని పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుమీదే పెట్రోల్ బాటిళ్లు, పురుగులమందు డబ్బాలలో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రైతులు వినకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు అక్కడే వంటావార్పు చేపట్టి రోడ్డుపైనే ఆందోళన చేశారు. పరిస్థితులను అంచనా వేసిన అధికారులు గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.