మార్చిలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్

by Shamantha N |   ( Updated:2021-11-26 07:06:56.0  )
narayana rane
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి ప్రభుత్వం రానున్న మార్చిలో కూలిపోతుంది అన్నాడు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం. అయితే వచ్చే మార్చిలో తమ పార్టీ బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇలాంటి మాటలు బీజేపీ నేతలు గతంలో కుడా చెప్పారు, కానీ అటువంటిది ఏమి జరగలేదు.

Advertisement

Next Story