‘తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం’

by Mahesh |   ( Updated:2021-05-08 05:39:52.0  )
‘తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంటే జగన్ పట్టించుకోవడం లేదన్నారు. జగన్ కి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకంపై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేకపోవడం విచారకరమన్నారు. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వచ్చే మద్యం షాపులు ముందు మందుబాబులను జాగ్రత్తగా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటింపజేస్తోన్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed