- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను మాత్రమే బాగుండాలనేది… చంద్రబాబు నైజం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతి ఉద్యమం రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నటనతోనే ఈ సమస్య మొదలైందని మంత్రి విమర్శించారు.
అంతేగాకుండా అమరావతిలోనే రాజధాని కొనసాగుతోందని మంత్రి నాని స్పష్టం చేశారు. నేను మాత్రమే బతకాలి అనేది చంద్రబాబు నైజం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఆరితేరారని అన్నారు. మూడు రాజధానులపై సీఎం జగన్ వెనక్కి తగ్గే సమస్యే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలను మేము అధికారంలోకి రాకముందే ఊహించామని అన్నారు.
Next Story