- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైనర్ అత్యాచారం.. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నరు
దిశ, నందిపేట్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్న యువకుడి తల్లికి మద్దతుగా మండల ముదిరాజ్ సంఘం సభ్యులు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత తల్లి మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న తమ కొడుకును పోలీసులు ఎలాంటి కారణం చెప్పకుండానే పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆర్మూర్‌లోని ఓ చర్చి పాస్టర్ అత్యాచారం చేసినట్టు ఒప్పుకోవాలని తన కొడుకును ఒత్తిడి చేశారని.. అంతేకాకుండా మా కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవసరమైతే డబ్బులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు చెప్పారు. అందుకు ఒప్పుకోకపోవడంతో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి పోలీసులే బలవంతంగా నేరం చేసినట్టు ఒప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాలికతో కేవలం కొన్ని నెలల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లోని చర్చి పాస్టర్ కుమారుడిపై అనుమానాలున్నాయని అన్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలైన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు వేముల సాగర్, గంగాధర్, దొంకేశ్వర్ శ్రీకాంత్, భోజన్న, తల్వేద శ్రీకాంత్ పాల్గొన్నారు.