పోడు భూముల రైతులకు అండగా.. నల్లమలలో సడక్ బంద్

by Shyam |   ( Updated:2021-10-03 04:49:37.0  )
పోడు భూముల రైతులకు అండగా.. నల్లమలలో సడక్ బంద్
X

దిశ, అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని హజీపూర్ చౌరస్తా శ్రీశైలం జాతీయ రహదారిపై
కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో జరగబోయే నల్లమల్ల సడక్ బంద్, రాస్తారోకో కార్యక్రమం చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలో అఖిలపక్షం‌‌లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి రైతులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అఖిలపక్ష ఆధ్వర్యంలో సీపీఐ సీపీఎం న్యూ డెమోక్రసీ టీజేఎస్ టీడీపీ, బీ ఎస్ పీ అన్ని పార్టీల ఆధ్వర్యంలో పోడు భూములు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరుతో ధరణి పోర్టల్ అనే ఒక సాఫ్ట్ వేర్‌ను తీసుకువచ్చి దానిద్వారా రైతులు భూముల విషయంలో చాలా ఇబ్బందులు పెడుతుందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హజీపూర్ చౌరస్తా ఎక్స్ రోడ్ రోడ్డు శ్రీశైలం జాతీయ రహదారిపై నల్లమల సడక్ బంద్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సీపీఎం, సీపీఐ నాయకులు అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అఖిల పక్ష నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ, టీజెయస్, టీడీపీ, బీ యస్ పీ, ఇతర మిత్రపక్షాలు పాల్గొన్నారు.

Advertisement

Next Story