నళిని ఆత్మహత్య బెదిరింపులు : జైలు అధికారులు

by Shamantha N |
నళిని ఆత్మహత్య బెదిరింపులు : జైలు అధికారులు
X

చెన్నై : రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్టు జైలు అధికారులు తెలిపారు. తోటి ఖైదీని చేసిన వేధింపుల ఫిర్యాదులపై నళిని ప్రశ్నించగా.. ఈ రకంగా బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది.ఆత్మహత్యకు యత్నించలేదని.. బ్లాక్‌మెయిల్ చేసిందని జైలు అధికారులు వివరించారు. గత కొంత కాలంగా నళిని వేధిస్తోందని, తనను వేరే సెల్‌లోకి మార్చాలని తోటి ఖైదీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమెను మరో సెల్‌లోకి మార్చితే ఆత్మహత్య చేసుకుంటానని నళినీ బెదిరించినట్టు తమిళనాడు జైళ్ల శాఖ చీఫ్ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు.

ప్రస్తుతం వెల్లూరు మహిళా జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని తరఫు న్యాయవాది మాత్రం జైలు అధికారుల వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని ఆరోపించారు. దాదాపు 30ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని ఎప్పుడూ ఇలాంటి బెదిరింపులు చేయలేదని, జైలు అధికారుల వేధింపుల వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు సిద్ధపడిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed