భారీ పోలింగ్ దిశగా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలు

by Sridhar Babu |   ( Updated:2021-04-30 03:59:00.0  )
భారీ పోలింగ్ దిశగా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తొలిసారిగా జరుగుతున్న నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదు అయ్యే దిశగా ముందుకు సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 65.74 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉండడంతో తొలిసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు భారీగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులో మొత్తం 21,832 ఓట్లు ఉండగా, ఒంటిగంట సమయానికి 14,056 ఓట్లు పోల్ అయ్యాయి. ఇదిలావుంటే.. నకిరేకల్ పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా పోలింగ్ సరళి, పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎన్నికల పరిశీలకురాలు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిణి వాకాటి కరుణతో నార్కట్ పల్లిలోని ఓసీటిఎల్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏ.వి. రంగనాధ్ చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed