వైష్ణవ్ తేజ్‌తో అక్కినేని హీరో.. స్టోరీ రెడీ

by Jakkula Samataha |
వైష్ణవ్ తేజ్‌తో అక్కినేని హీరో.. స్టోరీ రెడీ
X

దిశ, సినిమా : సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో తన మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్న వైష్ణవ్ తేజ్‌.. నెక్స్ట్ మూవీ ఏంటని? మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి నాగార్జున కేవలం నిర్మాతగానే వ్యవహరించనున్నారు.

ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగార్జున, వైష్ణవ్‌తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండగా, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తానని తెలిపారు నాగ్.

Advertisement

Next Story