మనిషి చస్తేనే ప్రకృతికి మంచిది : నాగబాబు

by Shyam |
మనిషి చస్తేనే ప్రకృతికి మంచిది : నాగబాబు
X

సినీ నటుడు నాగబాబు కరోనా వైరస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచం ఎటు వైపు పోతుందని ప్రశ్నించారు. ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తేనే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయని.. మిగిలిన జీవరాశులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయని ట్వీట్ చేశారు నాగబాబు. కరోనా వైరస్‌తో సహా సర్వ జీవరాశులు ప్రకృతి ధర్మాలకు లోబడి బ్రతుకుతున్నాయని… ఒక్క మనిషే ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాడని అన్నారు. అదే ప్రకృతికి లోబడి బతికితే ఇలాంటి వైరస్‌ల బారిన పడి ఇన్ని కష్టాలు తెచ్చుకోకపోయే వాళ్లం అని చెప్పాడు.

నాగబాబు పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మీరు చెప్పింది కరెక్ట్ అని సమర్ధిస్తే… మరి కొందరు నువ్వు కూడా మనిషివే కదా ఆ జాబితాలో ఉన్నట్లేనా అని విమర్శిస్తున్నారు. అదేదో మీతోనే మొదలెట్టాలని హితవు పలుకుతున్నారు.

Advertisement

Next Story