రష్మికనే కావాలంటున్న చైతు..

by Anukaran |   ( Updated:2020-07-04 04:06:55.0  )
రష్మికనే కావాలంటున్న చైతు..
X

వరుస హిట్స్ కొడుతూ కెరీర్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. క్రేజీ చాన్స్‌లు బుట్టలో వేసుకుంటూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ‘పుష్ప’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో జతకడుతున్న భామ.. కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలోనూ చాన్స్ కొట్టేసిందని సమాచారం. ఇదిలా ఉంటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తుండగా.. తన తర్వాతి చిత్రం డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఉండబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా ఈ సినిమాలో ముందుగా రియల్ కపుల్ ‘చైతూ, సామ్’ నటిస్తారని, ఆ తర్వాత సామ్ కాదు కీర్తి సురేష్ నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ ప్లేస్‌లో రష్మికను తీసుకుంటే బాగుంటుందని రికమెండ్ చేశాడట చైతు. కానీ నిర్మాత మాత్రం.. కీర్తి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. మరి ఈ అవకాశం వీరిలో ఎవరికి చిక్కుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed