- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాదల్ ముందుకు.. నగల్ ఇంటికి
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంపాదించిన భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మంగళవారం రిచర్డ్స్ బెరాంకిస్‌తో దాదాపు 2 గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో నగల్ గట్టిపోటీ ఇచ్చాడు. ప్రత్యర్థి బలమైన గ్రౌండ్ స్ట్రోక్స్ కొడుతున్నా.. నగల్ ధీటుగా ఎదుర్కున్నాడు. అయితే అనుభవం కలిగిన బెరాంకిస్ పై చేయి సాధించాడు. చివరకు 2-6, 5-7, 3-6 వరుస సెట్లలో నగల్ పరాజయం పాలయ్యాడు. గత వారం జరగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా నగల్ 72వ ర్యాంకర్‌పై ఓడిపోవడం గమనార్హం.
ఇక ఫ్రెంచ్ ఓపెన్ విజేత, గ్రాండ్‌స్లామ్ రికార్డుపై కన్నేసిన రాఫెల్ నాదల్ తొలి రౌండ్‌లో సెర్బియాకు చెందిన లాస్లో జెరెతో తలపడ్డాడు. తన సహజ శైలిలో ఆడిన స్పెయిన్ బుల్ రఫా.. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 6-3, 6-4, 6-1 వరుస సెట్లలో జెరెను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ 6-2, 6-2, 6-4 తేడాతో కెనడాకు చెందిన వాసెక్ పోస్పిసిల్‌పై విజయం సాధించాడు. బెల్జియంకు చెందిన 13వ సీడ్ డేవిడ్ గఫిన్ 6-3, 4-6, 7-6(4), 6-7(6), 3-6 తేడాతో ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలెక్సీ పోపిరిన్‌పై ఓటమిపాలయ్యాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ విక్టోరియా అజరెంకను అమెరికా అరంగేట్ర క్రీడాకారిణి జెస్సికా పెగుల 7-5, 6-4 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో అజరెంకా 25 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. ఈజిప్టునకు చెందిన మయార్ షెరిఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. క్వాలిఫయర్‌గా ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి అడుగు పెట్టిన ఆమె ఫ్రెంచ్ క్వాలిఫయర్ చోలె పక్వెట్‌పై 7-5, 7-5 తేడాతో విజయం సాధించింది. ఒక ఈజిప్టు క్రీడాకారిణి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక డిఫెండింగ్ చాంపియన్ సోఫియా కెనిన్ 7-5, 6-4 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన మాడిసన్ ఇంగ్లిస్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.