- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్తూరు జిల్లాలో నాటుబాంబుల కలకలం
దిశ, ఏపీ బ్యూరో: రాయలసీమలో ఇటీవల కాలంలో నాటు బాంబులు ప్రత్యక్షం కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రాయలసీమలోని పలు జిల్లాల్లో నాటు బాంబులు బయటపడ్డాయి. తాజాగా శనివారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీలోని మహేశ్వరపురం ఎస్టీ కాలనీలో నాటు బాంబులు లభించడం సంచలనంగా మారింది.
ఎస్టీ కాలనీకి చెందిన దొరస్వామి నాటు బాంబులను సంచిలో వేసుకుని తీసుకువెళ్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి – కొత్తపల్లిమిట్ట రహదారి గొడుగు చింత వద్ద అతడిని అదుపులోకి తీసుకుని సంచిలో తనిఖీలు చేయగా 20నాటు బాంబులు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. నాటు బాంబులు ఎలా వచ్చాయి..ఎవరు తయారు చేస్తున్నారు అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులను ఉపయోగిస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.