- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’పై వదంతులు.. వాస్తవాలు
దిశ, వెబ్‌డెస్క్: నిజం చెప్పులు తొడగకముందే.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్నట్టుగా.. కరోనావైరస్‌పై అనేక వదంతులు, అవాస్తవాలు ప్రచారమవుతున్నాయి. యోగాతో దీన్ని ఎదుర్కోవచ్చని, గోమూత్రం కరోనా విరుగుడు అని కొందరు బాబాలు చెబుతున్నారు. పూజలు, హోమాలు, ప్రార్థనలు చేస్తున్నారు. కరోనాను వెళ్లగొట్టడానికి… ‘గో కరోనా.. గో కరోనా.. కరోనా గో.. కరోనా గో’ అంటూ జపిస్తున్నారు. ఇటువంటి అశాస్త్రీయమైన ఆలోచనలను సులువుగానే పసిగట్టవచ్చు కానీ, ఇప్పుడు బలంగా ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు నిజమా? అబద్ధమా? అనే డైలామా చాలా మందిలో ఉన్నది. అలాగే, వీటిని నిర్ధారించేవారినీ ఎలా నమ్మాలి? అనే అనుమానమూ ఉంటుంది. అందుకే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వదంతులపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందనలు పరిశీలిద్దాం.
* కరోనా వైరస్ గాలిద్వారా సోకుతుందా?
సరిగ్గా చెప్పాలంటే.. ఇది గాలిద్వారా సోకే వైరస్ కాదు. తుంపర్ల(డ్రాప్లెట్స్) ద్వారా సోకుతుందని చెప్పుకోవచ్చు. కరోనాపాటిజివ్ వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఒక మీటర్ పరిధి వరకు ఆ తుంపర్లు వ్యాపించవచ్చు. ఆ సమయంలో ఆ పరిధిలో మనముంటే.. వైరస్‌తో కూడిన తుంపర్లు మన బాడీపై సెటిల్ కావొచ్చు. ఆ వైరస్ కొన్నిగంటలపాటు మన శరీరంపై జీవించి ఉండే అవకాశముంది. తర్వాత బాడీలోకి ఎంటర్ అయ్యే ప్రమాదముంటుంది.
* సర్జికల్, ఎన్95 మాస్క్‌లు తప్పనిసరా?
ఆరోగ్యవంతులకు సర్జికల్ మాస్క్ ధరించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికమెండ్ చేయలేదు. దగ్గుతున్నవారు ఈ మాస్క్ ధరిస్తే తుంపర్లు ఇతరులకు సోకకుండా అడ్డుకుంటుంది. ముఖాన్ని తరుచూ తడుముకోకుండా పనికొస్తుంది. కానీ, ఆరోగ్యవంతులకు ఈ మాస్క్ అవసరం లేదు. ఈ మాస్క్‌లు సరిగ్గా ధరించడమూ తెలిసి ఉండాలి. మాస్క్ పెట్టుకునేటప్పుడు, రీఅడ్జస్ట్ చేసుకునేటప్పుడూ విధిగా చేతులు కడుక్కోవాలి.
* మెటల్‌పై వైరస్ చనిపోదా?
ఇది ఉష్ణోగ్రతలు, వాతావరణంలోని తేమపై ఆధారపడి ఉంటుంది. ఇంటిలోపల లోహ ఉపరితలాలపై వైరస్ 8-10 గంటలవరకు జీవించవచ్చు. కానీ, సాధారణంగా 3-4 గంటలే బతుకుతుంది.
* చేతులు కడగటం కన్నా శానిటైజర్ల వాడకమే మంచిదా?
ప్రయాణంలో ఉన్నప్పుడు సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు శానిటైజర్ల వినియోగం మంచిది. కానీ, సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం. కెమికల్స్‌తో తయారైన ఈ శానిటైజర్లు వైరస్‌ను చంపేస్తాయి కానీ, కెమికల్స్ అలాగే చేతులపై ఉండిపోతాయి. అందుకే శానిటైజర్లు వాడినా.. ఇంటికి చేరాక తప్పకుండా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
* మద్యం కరోనాకు విరుగుడా?
కరోనావైరస్‌కు మద్యం(ఆల్కహాల్) విరుగుడుగా పనిచేస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
* వెల్లుల్లి, తేనే, నిమ్మ, లవంగాలు ఎదుర్కొంటాయా?
ఇవి వైరస్‌కు విరుగుడుగా పనిచేస్తాయన్న ఆధారాల్లేవు.
* రెండు.. మూడు గంటలు ఎండలో ఉండటం, వేడి నీరు తాగడం, తరుచుగా వేడినీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి ఉమ్మేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించుకోవచ్చా?
దీన్ని సమర్థించే సమాచారమేమీ లేదు. రోజూ సూర్యుని ఎండలో నిలబడినంత మాత్రానా వైరస్ రాదనుకోవడం అవాస్తవం.
* వేడి వాతావరణంలో వైరస్ జీవించలేదంటున్నారు. ఉష్ణోగ్రత పెంచితే వైరస్ చనిపోతుందా?
ఉష్ణమండల దేశాల్లోనూ ఈ వైరస్ వ్యాపిస్తున్నది. సింగపూర్, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ వాదనను నమ్మరాదు. అయితే, అధిక ఉష్ణోగ్రతలుంటే.. వైరస్ వ్యాప్తి కొద్దిమేరకు తగ్గొచ్చు.
* పెంపుడు జంతువులకూ వైరస్‌తో ప్రమాదమేనా? అవి వైరస్ వాహకాలుగా పనిచేస్తాయా?
ఒక జాతి నుంచి మరో జాతికి ఈ వైరస్ సోకుతున్న సమాచామేమీ లేదు. ఇప్పుడు కరోనావైరస్ మానవజాతికి సంబంధించిన వైరస్. కాబట్టి పెంపుడు జంతువుల నుంచి మనకు వైరస్ రావొచ్చన్న వాదనలో పసలేదు. ఇప్పుడైతే.. మనిషి నుంచి మనిషికి మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తున్నది.
* మాంసం తినడం సేఫేనా?
ఈ వైరస్ మొదట జంతువుల్లో కనిపించింది. ఇప్పుడు మానవులలోనూ వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఈ వైరస్ పెంచుకుంది. ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతున్నది. కాబట్టి ఇప్పుడు జంతువుల్లోని వైరస్‌తో భయపడాల్సిందేమీ లేదు. మాంసం, గుడ్లు తినడం ద్వారా కరోనావైరస్ సోకదు. సరిపడా నీళ్లతో మాంసాన్ని శుభ్రం చేసి వంటచేసుకోవడం ద్వారా సమస్య ఉండదు.
* ప్యాకేజ్డ్ ఫుడ్.. ముఖ్యంగా ఇంపోర్టెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ తినవద్దంటున్నారు?
చాలా వరకు ప్యాకేజ్డ్ ఫుడ్ సరైన విధంగా ప్రాసెస్ చేసి ప్యాక్ చేయబడతాయి. అటువంటి ప్యాక్‌లలో సుదీర్ఘంగా అంటే నెలలపాటు కరోనా వైరస్ బతికే చాన్స్ లేదు.