అమీర్‌పేట్‌ మెట్రో వద్ద వింత యాక్సిడెంట్

by Anukaran |   ( Updated:2023-06-13 16:20:23.0  )
అమీర్‌పేట్‌ మెట్రో వద్ద వింత యాక్సిడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద వింత ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెట్రో స్టేషన్ వద్ద ఉండే సైడ్ రెయిలింగ్ ను ఢీ కొట్టారు. అయితే, ఈ ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి తల సైడ్ రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. నోట్లో నుంచి రక్తం కక్కుతూ ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… వెనుక కూర్చున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందడంతో 108 సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి తలను మెట్రో రెయిలింగ్ నుంచి బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా రాలేదు. చివరకు ఐరన్ రెయిలింగ్ ను కట్ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed