నా కల నిజమైన రోజు : రాహుల్ త్రిపాఠి

by Anukaran |
నా కల నిజమైన రోజు : రాహుల్ త్రిపాఠి
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి అద్భుతంగా రాణించి, ప్రత్యర్థి బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. ‘నా కల నిజమైన రోజు అనుకోవాలి. నేను బ్యాట్, బాల్‌తో సిద్దంగా ఉన్నాను. జట్టు నా నుంచి ఏమి ఆశిస్తే అది చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు బ్యాట్‌తో నన్ను నేను నిరూపించుకున్నాను. జట్టు యజమాని షారుక్ ముందు బ్యాటింగ్ చేయడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.’అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed