- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిన్‌టెక్ సంస్థతో ముత్తూట్ ఫైనాన్స్ భాగస్వామ్యం!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ తన డిజిటల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా నీరా యాప్ ద్వారా వేతనం కలిగిన ఉద్యోగులు ముత్తూట్ ఫైనాన్స్ నుంచి రూ. లక్ష వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ‘తమ సంస్థలో పర్సనల్ లోన్‌ల వృద్ధిని మరింత పెంచేందుకు ఈ ఒప్పందం చేసుకున్నాం. దీని ద్వారా ముత్తూట్ ఫైనాన్స్ డిజిటల్ విభాగంలో మరింత మెరుగైన సేవలందిస్తామని’ ముత్తూట్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ విభాగం హెడ్ ప్రదీప్ చెప్పారు. నీరా సంస్థ భారత్‌లోని మధ్యతరగతి కుటుంబాల వారికి తక్కువ మొత్తంలో పర్సనల్ లోన్‌లను ఇస్తోందని, నెలకు రూ. 12 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి రుణాలు ఇస్తున్నట్టు నీరా తెలిపింది. ముత్తూట్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ద్వారా కొత్త రుణాలను ఇచ్చేందుకు వీలవుతుందని నీరా సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు రోహిత్ సేన్ చెప్పారు.