అనవసరంగా కేసుల పాలు కావొద్దు : అడ్వకేట్ హరిబాబు

by Shyam |
Advocate Haribabu
X

దిశ, రామగిరి: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్ రెడ్డి, లోక్ అదాలత్ మెంబర్ రఘోత్తమరెడ్డి అన్నారు. మంగళవారం రత్నాపూర్ గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ అధ్యక్షతన చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 3.50 కోట్ల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

చట్టాలపై అవగాహన లేకపోవడం మూలంగానే అమాయక ప్రజలు కేసుల పాలు అవుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని, అనవసరంగా కేసుల పాలు కావొద్దని సూచించారు. ఈ సదస్సులో ఏపీపీఓ ఆకుల రాము, అడ్వకేట్లు విజయ్ కుమార్, శ్రీనివాస్, సుభాష్, కుమార్, శ్రీహరి, నాగరాజు, స్రవంతి, షబానా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed