- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవత్వం చాటిన మైనార్టీ సోదరులు.. ఏం చేసారంటే.?
by Shyam |

X
దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని శ్రీనివాసా కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ భార్య చంద్రకళ కరోనాతో మంగళవారం రాత్రి మృతి చెందింది. దహన సంస్కారాలు చేయడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానికులు కల్వకుర్తి పట్టణానికి చెందిన ఖాదర్ టీం సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఖాదర్, కాజా, ఇమ్రాన్, గౌస్, సలీం, షాకీర్లు బుధవారం ఆమనగల్లుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలను నిర్వహించిన ఖాదర్ టీం సభ్యులను పట్టణ ప్రజలు అభినందించారు. ఇప్పటి వరకు కల్వకుర్తి నియోజకవర్గంలో 35 దహన సంస్కారాలు చేసినట్లు ఖాదర్ తెలిపారు.
Next Story