- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంత్యక్రియలలో.. ఆ నలుగురు
దిశ ప్రతినిధి, మెదక్: నేటి సమాజంలో మనిషికంటూ విలువలు లేకుండా పోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మానవత్వం.. మనుషుల మధ్య సత్సంబంధాలు.. బంధం, బంధుత్వము మాయమైతున్నాయి. మనిషి మరణించిన చివరి క్షణంలో బంధువులు, స్నేహితులు కనీసం అంతిమ సంస్కరాలకు హాజరు కాలేక పోతున్నారు. కనీసం చివరకు పాడే మోసేందుకు ఆ నలుగురు రాలేని సమయంలో మేమున్నాం అంటూ ఆ నలుగురు ముందుకొస్తున్నారు. వాళ్ల ముస్లిం కమ్యూనిటీ కి చెందిన వారు కాకపోయినా, మాకు కులం, మతం సంబంధం లేదు అంటూ కరోనా మృతుల అంతిమ సంస్కారాలు నిర్వహిస్తు తమ మానవత్వన్ని నిరూపించుకుంటున్నారు.
కరోనతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు తాము ముందు ఉంటామని సిద్దిపేట ఇస్లాంపురా, సాజిద్ పురలకు చెందిన ముస్లిం యువకులు డబ్బు, ప్రతిఫలం ఆశించకుండా లేకుండానే స్వచ్చందంగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన అగుర్ల బాలయ్య గత కొన్ని రోజుల క్రితం కరోన బారిన పడి సిద్దిపేట లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతిని బంధువులు ముస్లిం యువకులు సోహెల్, హాజీ, పర్వేజ్, అబ్బాస్, అథిక్లకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్నీ వారి గ్రామనికి తీసుకెళ్లి స్వంత డబ్బులతో అంత్యక్రియలు నిర్వహించారు. వారు ముస్లిం కమ్యూనిటీ చెందిన వారైనా ఇలా కలం, మతం అనే తేడా లేకుండా యువకులు ముందుకు వచ్చి కరోనా బారిన పడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా సోహెల్, హజీలు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఏ వర్గం వారైనా సరే కరోనాతో మృతి చెందితే అంతక్రియలు నిర్వహించడానికి తమతో పాటు తమ మిత్రులు ముందుకు వస్తామన్నారు. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలని నిర్ణయించుకున్నామన్నారు. 9160410312, 9704886826 ఫోన్ నెంబర్లకు సంప్రదిస్తే ఎలాంటి ఖర్చులేకుండా ఉచితంగా తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నేటి సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు మాయమైపోతున్న తరుణంలో కరోనా సంక్షోభంలో ఈ లాంటి యువత స్వచ్చంద కార్యక్రమాలతో ముందుకు రావటం పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.