- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చాటుకున్న ముస్లిం యువకులు…
దిశ, అచ్చంపేట : కరోనా కారణంగా మరణించిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు రాకపోవడంతో, ఆ వ్యక్తి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు ముస్లిం యువకులు. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య (50)కు గత పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని గ్రామస్తులు వెలివేశారు. దీంతో తిరుపతయ్య జిల్లా కేంద్రంలో వైద్య సదుపాయాలు పొందినట్లు సమాచారం. కాస్త ఆరోగ్యం మెరుగుపడటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రం నుండి తన స్వగ్రామమైన తిరుమలాపూర్ వెళ్లేందుకు అమ్రాబాద్ బస్టాండ్ కు చేరుకునేసరికి చీకటి పడింది. స్వగ్రామం వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో తిరుపతయ్య మద్దిమడుగు తిరుమలాపూర్ రహదారి పక్కన ఒక పాత ఇంటి ముందు నిద్రిస్తూ అలాగే మరణించాడు.
శనివారం ఉదయం గ్రామస్తులు ఒక గుర్తు తెలియని వ్యక్తి అమ్రాబాద్ మండల కేంద్రంలో మరణించాడని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ క్రమంలో మృతుడు తిరుపతయ్య మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినప్పటికీ ఎవ్వరు ముందుకు రాకపోవడంతో అమ్రాబాద్ కు చెందిన నలుగురు ముస్లిం యువకులు అంత్యక్రియలకు సహాకరించి మానవత్వంను చాటుకున్నారు. కన్నబిడ్డలు తోబుట్టువులు ఎవరూ రాకపోయినప్పటికీ మానవతా దృక్పథంతో మైనార్టీ యువకులు ఆ వ్యక్తి అంతక్రియలు చేపట్టడంతో మండల ప్రజలు అభినందిస్తున్నారు.