‘అయోధ్య రామయ్యకు’ ముస్లిం మహిళల హారతి(వీడియో)

by Anukaran |   ( Updated:2021-11-04 22:44:33.0  )
‘అయోధ్య రామయ్యకు’ ముస్లిం మహిళల హారతి(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది అయోద్య రామ మందిరం . అక్కడికి వెళ్లి రాముని దర్శనం చేసుకోవాలని ఇప్పుడు దేశంలో చాలా మంది ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడ కేవలం హిందువులు మాత్రమే రామున్ని పూజిస్తారు అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే. హిందువులతో పాటు చాలా మంది ముస్లిం లు కూడా శ్రీ రామున్ని కొలుస్తారు. ఇందుకు ఉదాహరణే వారణాసి లోని ఈ రామాలయం. వారణాసిలో ఏటా మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ రామునికి మంగళ హారతులతో పూజలు చేశారు. గత 15 ఏళ్లుగా ప్రతి దీపావళికి రామునికి హారతి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది అని స్థానిక ముస్లిం మహిళలు తెలిపారు.

ప్రతి సారి లానే ఈ సారి కూడా హారతి సంప్రదాయాన్ని పాటించామని వారణాసికి చెందిన ముస్లిం మహిళ నంజీన్ అన్సారి తెలిపారు. తన చేతులతో స్వామి వారికి పూజలు చేయడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. భక్తి శ్రద్దలతో పాటలు పాడుతూ, హారతి ఇచ్చారు. ఈ పూజకు కేవలం హిందువులు మాత్రమే కాదు చాలా మంది ముస్లింలు కూడా వచ్చారు. వేద పండితులతో కలిసి అన్సారి ఈ పూజలు నిర్వహించింది. దేవుని విగ్రహానికి పూల మాల వేసి హరతులు ఇచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ సారి దీపావళి పూజను అయోధ్య రాముడి పేరుమీద నిర్వహించారు.

Advertisement

Next Story