‘ఎన్‌పీఆర్ కోసం పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి..’

by Shamantha N |
‘ఎన్‌పీఆర్ కోసం పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి..’
X

దేశవ్యాప్తంగా ‘ఎన్‌పీఆర్‌’ అమలు గురించి గతంలో పలు వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ మరోసారి ఆ తరహా వ్యాఖ్యలు ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖాలు ధరించి పోలింగ్ బూత్ లైన్‌లో నిలబడి ఓటరు కార్డులు చూపెడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. దీనికి ‘ కాగజ్ నహీ దిఖాయేంగే హమ్’(మేము మా గుర్తింపు పత్రాలు చూపెట్టం)’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో పాటు ‘గుర్తింపు పత్రాలు భద్రంగా ఉంచుకోండి, ఎన్‌పీఆర్ అమలు సమయంలో చూపెట్టాల్సి ఉంటుందంటూ’ ట్వీట్ చేసింది. సదరు నినాదం సీఏఏ, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుకు వ్యతిరేకంగా నిరసనకారులు, ఉద్యమకారులు, కళాకారులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే.
అయితే ఈ వీడియోపై ట్విటర్ యూజర్లు ఆసక్తికరంగా స్పందించారు. నిన్నటి వరకు ‘మేము గుర్తింపు పత్రాలు చూపించం’ అన్న ముస్లింలు, ఈరోజు చేతిలో గుర్తింపు కార్డులతో లైన్‌లో నిలబడటం పట్ల ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story