- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భూతగదాలతో వ్యక్తి దారుణ హత్య…
by Shyam |

X
దిశ, ఆందోల్:
భూ తగాదాలతో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం మాన్ సాన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… అందోల్ మండలం మాన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన రాములు, అతని కొడుకు శ్రీకాంత్ పత్తిచేనులో పత్తి తీస్తున్నారు. ఈ సమయంలో రాములుకు వరుసకు అన్న అయిన కిష్టయ్య, ఆయన కొడుకు మురళీలు కలిసి రాములు అతని కొడుకు శ్రీకాంత్ పై కత్తులతో దాడి చేశారు.
ఈ దాడిలో రాములుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. శ్రీకాంత్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్య చేసిన కిష్టయ్య, మురళిలు పరారీలో ఉన్నారనీ, వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జోగిపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Next Story