మానవత్వం చాటుకున్న మునిపంపుల పోలీసులు

by Shyam |
Munipampula police
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల్లో కఠినత్వమే కాదు.. మానవత్వం కూడా ఉందని మునిపంపుల పోలీసులు నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తుడికి ఆర్థికసాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన బండారు యాదయ్య గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అంతేగాకుండా.. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. దీంతో ఈ విషయం తెలిసిన మునిపంపుల గ్రామానికి చెందిన పోలీసులు ఆదివారం యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఉండ్రాతి గణేష్, జోగుల వెంకటేశ్, గునుగుంట్ల ప్రభాకర్, సిరిసనగండ్ల ఉప్పలయ్య, మామిండ్ల నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed