- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం: మిడ్ డే మీల్స్‌కు బదులు విద్యార్థులకు పశువుల దాణా..
దిశ, వెబ్‌డెస్క్: పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించడం, సరిపడనంత సరుకులు రాక విద్యార్థులు పస్తులుండటం, కుంభకోణాల గురించి విని ఉంటారు. కానీ విద్యార్థులకు అందించాల్సిన పోషకాహారానికి బదులు పశువుల దాణాను పంపించడం ఎక్కడైనా చూశారా..? మహారాష్ట్రలో ఆ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పూణె మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పాఠశాలలో విద్యార్థులకు ఇవ్వాల్సిన రైస్, ఇతర వస్తువుల స్థానంలో సదరు స్కూలు నిర్వాహకులు పశువుల దాణాను అందుకోవడం గమనార్హం.
కరోనా కారణంగా మహారాష్ట్రలో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూణెలో విద్యార్థులు పాఠశాలలకు రావొద్దని, ఇంటి వద్దకే మధ్యాహ్న భోజనాన్ని పంపిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అయితే మధ్యాహ్న భోజనం కోసం స్కూలుకు వచ్చిన బ్యాగులను ఓపెన్ చేయగా.. అందులో బియ్యానికి బదులు పశువుల దాణా కనిపించింది. ఇది చూసి అవాక్కయిన పాఠశాల నిర్వాహకులు పూణె మేయర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు.