- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తల్లిదండ్రులను వేధిస్తున్న మున్సిపల్ చైర్మన్.. తల్లి ఏం చేసిందంటే ?
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ రఘు కన్న తల్లిదండ్రుల పై దాడి చేశారు. గత కొన్ని రోజుల నుంచి ఆస్తి కోసం చైర్మన్ రఘు తన తల్లి దండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బుధవారం మరోసారి దాడి చేయడంతో రఘు తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత మూడు నెలలుగా తన కొడుకు ఆస్తి కోసం వేధిస్తున్నారని, ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే కుమారుడు రఘు వల్ల ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని కర్నూలు ఎస్పీని బాధితురాలు కోరింది. దీంతో పోలీసులు చైర్మన్ రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story