ఐపీఎల్‌కు ఎంపిక కాలేదు.. యువ క్రికెటర్ ఆత్మహత్య

by Shiva |
ఐపీఎల్‌కు ఎంపిక కాలేదు.. యువ క్రికెటర్ ఆత్మహత్య
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌(IPL 13th season)లో ఆడే అవకాశం రాలేదని మనస్తాపం చెందిన ఓ యువ క్రికెటర్(Young cricketer) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. కరణ్ తివారి అనే యువకుడు ముంబైలో క్లబ్ క్రికెట్(Club cricket) ఆడుతుంటాడు. అతని బౌలింగ్ అచ్చం దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్(South Africa fast bowler Dale Steyn) శైలిని పోలి ఉంటుంది. దీంతో అందరూ అతడిని ‘జూనియర్ స్టెయిన్’(Jr. Stein) అని పిలుస్తుంటారు.

ఈ క్రమంలో తాను తప్పకుండా ఐపీఎల్‌(IPL)కు ఎంపికవుతానని కరణ్(Karan) భావించాడు. కానీ, అవకాశం రాలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కరణ్ సోమవారం రాత్రి ముంబై మలాడ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఉదయ్‌పూర్‌లోని తన స్నేహితుడికి కరణ్ కాల్ చేశాడు. దీంతో ఆ స్నేహితుడు వెంటనే కరణ్ సోదరికి సమాచారం ఇచ్చాడు.

ఆమె కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసే లోపే ఆత్మహత్య(Suicide)కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, బీసీసీఐ(BCCI) నిబంధనల ప్రకారం ఏదైనా రాష్ట్ర జట్టు తరఫున ఆడిన వారే ఐపీఎల్ వేలానికి అర్హులు. అయితే, కరణ్ ఏ జట్టు తరఫునా ఆడలేదు. కానీ, వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు నెట్ ప్రాక్టీసులు బౌలింగ్ చేసేవాడని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed