భారీ వర్షాలతో మునిగిన మహానగరం

by Shamantha N |   ( Updated:2021-06-09 02:54:37.0  )
భారీ వర్షాలతో మునిగిన మహానగరం
X

దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాలతో మహానగరం మునిగిపోయింది. ఎడతెరపి లేని వానలతో ఆర్థిక రాజధాని తడిసి ముద్దయింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. ఇక మహానగరం రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్ గడ్, పుణే, బీడ్ ప్రాంతాల్లో వర్షాల ధాటికి ప్రజలు బేబేలెత్తున్నారు. మరో ఐదు రోజుల పాటు వర్షాలుంటాయని.. రాబోయే 48 గంటల్లో అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ హెచ్చరికలతో నగరవాసుల్లో టెన్షన్ మొదలైంది. ముంబై అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న తీరం అంచున ఉన్నందున, అధిక ఆటుపోట్లకు గురవుతుంది. మత్స్యకారులు జూన్ 9 నుండి జూన్ 12 వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed