- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కేసులో… కంగనాను విచారించనున్న ముంబై పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, అనేక మలుపులు తిరుగుతూ, కొత్తగా డ్రగ్స్ ఇష్యూ తెరమీదరకు వచ్చింది. అయితే మొదటి నుంచి డ్రగ్స్ విషయమై నటి కంగనా రనౌత్ పలువురిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరగా చుట్టూ తిరిగి ఈ కేసులో ఆమె చిక్కుల్లో పడింది. కంగనాకు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయంపై విచారణకు ఆదేశించినట్టు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆమె డ్రగ్స్‌కు బానిస అన్న విషయాన్ని అయ్యదన్ సుమన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారని ఆయన తెలిపారు.
‘కంగనాకు అయ్యదున్ సుమన్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నట్టు అతడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కంగనాకు డ్రగ్స్ అలవాటు ఉందని, తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేసిందని సుమన్ వెల్లడించారు. కాగా తాజాగా ఈ విషయమై ముంబై పోలీసులు విచారణ చేయనున్నారు. ఎమ్మెల్యేలు సునిల్ ప్రభు, ప్రతాప్ సార్నాయిక్‌ల విజ్ఞప్తి మేరకు నేను అసెంబ్లీలో సైతం సమాధానం ఇచ్చాను’ అని హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కాగా, కంగనా అభిమానులు మాత్రం ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర అని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.