ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ స్టార్ట్

by Shyam |
ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ స్టార్ట్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్ గురువారం నుంచి శిక్షణ ప్రారంభించింది. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ లేఖ రాసిన కొన్ని గంట్లలోనే ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరం ప్రారంభించడం గమనార్హం. ముంబయి శివారు గన్సోలీలోని రిలయన్స్ స్టేడియంలో ఆటగాళ్లు సాధన ప్రారంభించారు. ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, ధవల్ కులకర్ణి, ఆదిత్య టారే ప్రాక్టీసులో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ జరుగుతుందని చెప్పడం, వెంటనే ముంబయి ఇండియన్స్ శిక్షణా శిబిరం ప్రారంభించడం అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

Advertisement

Next Story