- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ రికవరీ పేషెంట్ల మందులు డొనేట్ చేస్తున్న డాక్టర్లు
దిశ, ఫీచర్స్ : కరోనా బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. తాము చేయగలిగిన సాయం చేస్తూ మహమ్మారిపై సమిష్టి పోరుకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన డాక్టర్ కపుల్.. కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల వద్ద నుంచి 20 కిలోల కరోనా మెడిసిన్‌ను సేకరించి రూరల్ ఏరియాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లకు డొనేట్ చేస్తూ.. కరోనా ట్రీట్‌మెంట్ కోసం పేదలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
డాక్టర్ రానీ, అతడి భార్య డాక్టర్ రైనా కలిసి ‘మెడ్ ఫర్ మోర్’ పేరుతో మే 1న ఈ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు. కొవిడ్-19 నుంచి రికవరీ అయిన పేషెంట్లు ఉపయోగించని మందులను వారి వద్ద నుంచి సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 100 బిల్డింగ్స్‌లోని రెసిడెంట్స్.. తమ వద్ద మిగిలిపోయిన, ఎక్స్‌పైరీ కానటువంటి మందులను డొనేట్ చేశారు. ఈ క్రమంలో డాక్టర్ దంపతులు కేవలం 10 రోజుల్లోనే 20 కిలోల మెడిసిన్ కలెక్ట్ చేశారు.
కాగా దేశమంతా మెడికల్ సప్లైస్ కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. సింగిల్ డోస్ మెడిసిన్ కూడా వేస్ట్ అవకుండా అవసరమున్న వారికి సరఫరా చేస్తున్న వీరి సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ ప్రయత్నానికి సంబంధించి తమను ప్రేరేపించిన పరిస్థితుల గురించి డాక్టర్ రైనా వెల్లడించారు. ‘మా స్టాఫ్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరికి వైరస్ సోకినపుడు మందులు అవసరమయ్యాయి. కానీ కరోనా మెడిసిన్ ధరలు భగ్గుమంటుండటంతో అప్పటికే కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ల దగ్గర మిగిలిపోయిన మందులను సేకరించి వారికి ఇవ్వాలని నిర్ణయించాం’ అని డాక్టర్ రైనా వెల్లడించారు.
ఎనిమిది మంది సభ్యులతో టీమ్‌గా ఏర్పడి, డాక్టర్ కపుల్ చేస్తున్న సర్వీస్‌కు ఇన్‌స్పైర్ అయి చాలామంది వలంటీర్లు ఈ ఇనిషియేటివ్‌లో భాగం అవుతున్నారు. ప్రస్తుతం ఓ ఎన్జీవోతో కలిసి బాధితులకు మెడిసిన్ సరఫరా చేస్తున్న వీరి టీమ్.. గుజరాత్‌తోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సైతం మెడిసిన్ పంపేందుకు సిద్ధమవుతున్నారు.