హైవేలపై మల్టీ లెవల్ ప్లాంటేషన్

by Shyam |
హైవేలపై మల్టీ లెవల్ ప్లాంటేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రహదారుల వెంట కొన్ని కిలోమీటర్లు ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అటవీ, నేషనల్ హైవేస్ అథారిటీలు సంయుక్తంగా నిర్ణయించాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, అటవీ అనుమతుల తాజా స్థితిపై హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న 29 రోడ్ల అనుమతులు, పురోగతిపై ప్రధానంగా సమావేశంలో సమీక్షించారు. మొదటి, రెండో దశల అనుమతులకు కావాల్సిన పనుల్లో వేగం పెంచడంపై రెండు శాఖల మధ్య సమన్వయంపై చర్చ జరిగింది.

అందులో భాగంగా సంగారెడ్డి–నాందేడ్–అకోలా, హైదరాబాద్–మన్నెగూడ, నిజామాబాద్–జగదల్ పూర్, మంచిర్యాల- చెన్నూరు, హైదరాబాద్–భూపాలపల్లి జాతీయ రహదారుల విస్తరణతో పాటు, ఇతర రోడ్ల అనుమతులపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, జాతీయ రహదారుల సంస్థ సలహాదారు ఏ.కే. జైన్, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. దోబ్రియాల్, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి ఏ. కృష్ణ ప్రసాద్, ఎస్.కే. కుష్వాహా, జాయింట్ అడ్వయిజర్ కే.ఎస్. రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు ఎం.రవీందర్ రావు, పీ. నాగేశ్వరరావు, పీ.ధర్మారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed