పూరీ, విజయ్ మూవీ సీక్రెట్?

by Shyam |
పూరీ, విజయ్ మూవీ సీక్రెట్?
X

పూరీ జగన్నాథ్… క్రేజీ డైరెక్టర్. హీరోలను సూపర్ స్టార్స్‌గా మార్చే సత్తా ఆయన సొంతం. అందుకే మెగాస్టార్ చిరు తన తనయుడు రామ్‌చరణ్‌ను ఇంట్రడ్యూస్ చేసేందుకు పూరీని ఎంచుకున్నారు. చిరుత సినిమాతో పూరీ డైరెక్షన్‌లోనే ఎంట్రీ ఇచ్చాడు చరణ్. కథనాయకుల్లో మాస్ యాంగిల్‌ను చాలా చక్కగా ఎలివేట్ చేసే పూరీ ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న కథానాయకులకు మాంచి హిట్స్ ఇచ్చాడు. మహేష్ బాబుకు పోకిరి, ఎన్టీఆర్‌కు టెంపర్… ఇలా చాలామంది హీరోలకు సపోర్ట్ ఇచ్చారు పూరీ.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ డూపర్‌హిట్ కొట్టాడు. ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా షూటింగ్ షురూ చేశాడు. ఇందులో బాలీవుడ్ క్యూటీ అనన్యపాండేను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని సమాచారం. ఈ మూవీ గురించి రహస్యం ఏదో చెప్పబోతుందట చిత్ర యూనిట్. గురువారం ఉదయం10 గంటలకు ఆ సీక్రెట్ చెప్పబోతున్నట్లు ప్రకటించింది ఛార్మి. ధర్మ ప్రొడక్షన్స్‌ కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ, చార్మిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇంతకీ ఆ సీక్రెట్ ఏమై ఉంటుందనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed