- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ది హిడెన్ హిందూ’ ఆధారంగా ధోనీ సిరీస్
దిశ, వెబ్‌డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌లో మకుటం లేని మహారాజు. తను క్రీజులో ఉంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నెగ్గేస్తాం అనే ఆశ అభిమానుల్లో ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అభిమానులంతా కన్నీరు పెట్టుకున్నారు. అయితే ధోనీ, తన భార్య సాక్షితో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారని తెలిసి సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడే సిక్స్ ప్రాజెక్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపిన సాక్షి ధోనీ.. ఇందులో ఒకటి ఇంకా పబ్లిష్ కానటువంటి బుక్ నుంచి తీసుకున్న స్టోరీ అని చెప్పింది. కొత్త రచయిత రాసిన ఈ పుస్తకం ఆధారంగా మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసినట్లు తెలిపింది.
ఆ పుస్తకమే అక్షత్ గుప్తా రాసిన ‘ది హిడెన్ హిందూ’ అని సమాచారం. ఇండియన్ కాస్ట్‌లియెస్ట్ వెబ్ సిరీస్‌గా రూపొందనున్న ఈ పుస్తకం.. సాక్షికి చాలా నచ్చిందని తెలుస్తోంది. సత్య యుగంలో జన్మించిన ఒక అఘోరా చుట్టూ కథ తిరుగుతుండగా.. టైమ్ ట్రావెల్ చేసే కొన్ని క్యారెక్టర్స్ హైలెట్ కానున్నాయని సమాచారం. ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్ భారతీయ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుందని టాక్.