- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ధోనీకి దూకుడెక్కువే.. కానీ..’
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడనే ఆ బిరుదు ఇచ్చారు. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడెక్కువ అనే పేరు పడింది. ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటూ ప్రత్యర్థి జట్టును మాటలతో కూడా కవ్విస్తుంటాడు. దీంతో అందరూ ధోనీ కంటే కోహ్లీకి దూకుడెక్కువని అంటుంటారు. కాగా, ఇది వాస్తవం కాదని టీం ఇండియా మాజీ సెలెక్టర్ గగన్ ఖోడా అన్నారు.
విరాట్ కోహ్లీలా ధోనీకి కూడా దూకుడు ఎక్కువేనని, కానీ అది మాటల్లో కనిపించకుండా జాగ్రత్త పడేవాడని చెప్పాడు. తాజాగా, ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖోడా మాట్లాడుతూ.. ‘కోహ్లీకి దూకుడెక్కువ, ధోనీకి తక్కువ అనే మాటలను నేను విశ్వసించను. ధోనీ దూకుడుగా ఉంటూనే జాగ్రత్తలు తీసుకునే వాడు. అందుకే బయటపడేవాడు కాదు. ప్రత్యర్థులకు దొరకకుండా దూకుడుగా ఎలా ఉండాలనే విషయాలను ధోనీ త్వరగా నేర్చుకుంటాడు. అయితే, అది మాటల్లో కనిపించదు. కోహ్లీ అలా కాదు. ఈ మధ్యే విరాట్ కూడా నేర్చుకుంటున్నాడు’ అని పేర్కొన్నాడు.