హరితహారం అంతా గోల్ మాలేనా..? తనిఖీ పేరుతో రికార్డులు స్వాధీనం

by Shyam |
mpdo
X

దిశ, శామీర్ పేట్: ఫిర్యాదారులపై ఒత్తిడికి ఎంపీడీవో ప్రయత్నిస్తున్నారు..? విచారణ సమయంలో గ్రామాల్లో ఆ అధికారికి పనెంటో అర్థం కాని పరిస్థితి. అలియాబాద్, మూడు చింతల పల్లి పంచాయతీ కార్యదర్శులు శామీర్ పేట్ ఎంపీడీవో వేధింపులు చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కానీ ఎంపీడీవో ఆగడాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఫిర్యాదుదారుల గ్రామాల్లో పర్యటిస్తూ రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు. అసలు రికార్డులు స్వాధీనం ఎందుకు..? రికార్డులు తారుమారు చేసేందుకా..? పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేసేందుకా అర్థం కాని సందర్భం.

బుధవారం అలియాబాద్ గ్రామంలో ఎంపీడీవో పర్యటన, రికార్డుల స్వాధీనం పలు అనుమానాలకు తావిస్తోంది. అలియాబాద్ గ్రామంలో ఎంపీవో తో కలిసి పర్యటించిన ఎంపీడీవో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తిరిగి సాయంత్రం రికార్డులు పంచాయతీ కార్యాలయంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఒక సందర్భంలో సిబ్బంది పై ఒత్తిళ్లు కూడా తీసుకు వచ్చారు. అసలు గ్రామంలో ఎందుకు పర్యటించినట్లు? ఎందుకు రికార్డులు ఇచ్చేందుకు పాట్లు పడ్డారో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తలలు బాదుకుంటున్నారు.

రికార్డుల తారుమారుకు యత్నమా?

అలియాబాద్ గ్రామంలో ఎంపీడీవో పర్యటన, రికార్డుల స్వాధీనం విషయంలో ఏం జరుగుతుంన్నదని పంచాయతీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ఆలోచనలో పడ్డారు. అలియాబాద్ లో హరితహారం మొక్కల విషయంలో ఎంపీడీవో పెట్టిన బిల్లు. విచారణలో చెప్పిన సమాధానాలు పొంతన లేకపోగా… విచారణ సమయంలో ఎంపీడీవో తీరు అనుమానాస్పదంగా ఉందని గ్రామ పంచాయతీ పాలక వర్గం, సిబ్బంది చర్చించుకుంటున్నారు. హరితహారం మొక్కలు కడియం నుండి తెప్పించానని జడ్పీ సీఈఓ విచారణలో చెప్పిన అధికారి. డిప్యూటీ కమిషనర్ విచారణలో మహబూబ్ నగర్ నుండి తెప్పించానని చెప్పినట్లు. అందుకు ఒక బిల్లును పెట్టినట్లు సమాచారం. ఐతే హరితహారం బిల్లుపై ఇప్పటికే పాలకవర్గం తీర్మానం ఇవ్వడం కుదరదని చెప్పినట్లు తెలుస్తోంది. హరితహారం బిల్లు లేదా ఇంకేదైన విషయం బయటకు వస్తుందా అనే అనుమానం తో రికార్డుల తారుమారుకు యత్నించారు అని ఆలోచనలో పడ్డారు.

అసలు హరితహారం లో కడియం మొక్కలు వచ్చాయా..?

అలియాబాద్ విషయంలో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎంపీడీవో ప్రవర్తన పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఒక్క అలియాబాద్ లోనేనా శామీర్ పేట్ మండలంలోని అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి ఉందా.. అనుకుంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. హరితహారం మొక్కలు, జరిగిన పనులు విషయంలో అలియాబాద్, శామీర్ పేట్ మండలం, తూముకుంట మున్సిపాలిటీ లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రభుత్వ సంపదను కాపాడాలని కోరుతున్నారు.

రాని మొక్కలకు పెట్టిన బిల్లు..

అలియాబాద్ లో హరితహారం కోసం తేని మొక్కలకు తెచ్చినట్లు ఎంపీడీవో బిల్లు పెట్టిన విషయం తెలిసిందే. ఆ మొక్కలకు సుమారు 36 వేలు ఖర్చు అయినట్లు బిల్ రిసిప్ట్ కూడా తయారు చేశారు. లేని మొక్కల కోసం పెట్టిన బిల్లు ను పాలకవర్గం ముందుగానే గుర్తించి పెట్టని మొక్కలకు బిల్లు ఎందుకని తీర్మానం చేసే పరిస్థితి లేదని తేల్చి చెప్పినట్లు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు చర్చించుకుంటున్నారు. తీసుకురాని మొక్కల కోసం లేని బిల్లు పెట్టిన ఎంపీడీవో పై సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆలోచనలో పడ్డారు.

Advertisement

Next Story