సైకిల్‌పై హాస్పిటల్‌కు వెళ్లి.. మగబిడ్డకు జన్మనిచ్చిన ఎంపీ

by Anukaran |   ( Updated:2021-11-28 01:21:29.0  )
MP-1
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ పార్లమెంటు మెంబర్ జూలీ అన్నే జెంటర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఆమెకు నొప్పులొచ్చాయి. ఈ క్రమంలో ఆమె స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ హాస్పిటల్ కు వెళ్లి జాయినయ్యింది. గంట తర్వాత ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘ఈరోజు తెల్లవారుజామున 3.04 గంటలకు మేం మా కుటుంబంలోని సరికొత్త సభ్యుడిని స్వాగతించాం. నేను నిజంగా ప్రసవ సమయంలో సైకిల్ పై వెళ్లాలని అనుకోలేదు. కానీ, అలా జరిగిపోయింది’ అని పేర్కొన్నది.

Mp-2

mp-3

Advertisement

Next Story