పట్టభద్రులు నిరుద్యోగ భృతి పొందే బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఎంపీ విజయసాయి రెడ్డి..

by srinivas |
vijay sai
X

దిశ, ఏపీ బ్యూరో: రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మూడు కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2020 పేరిట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్ధుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్ధి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశంగా చెబుతూ బిల్లును ప్రవేశపెట్టారు.

దేశంలోని 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న పట్టభద్రులు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ బిల్లును విజయసాయి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రార్ధనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు గరిష్ట శిక్షను రెండేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళకు పెంచేలా చట్ట సవరణ చేపట్టే బిల్లును విజయసాయి రెడ్డి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 2021 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన టెంపుల్‌ డిస్ట్రక్షన్‌ పార్టీ (టీడీపీ) అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed