వైఎస్ వర్థంతి రోజు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విశాఖలోనే తనువు చాలిస్తా

by srinivas |   ( Updated:2021-09-02 04:50:01.0  )
వైఎస్ వర్థంతి రోజు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విశాఖలోనే తనువు చాలిస్తా
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ వర్థంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు డబ్బుపై ఎలాంటి ఆసక్తి లేదని, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. తాను, తన కుటుంబ సభ్యులు విశాఖలో భూ అక్రమణలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న వార్తలు చాలా బాధించాయన్న విజయసాయిరెడ్డి తనకు ఆస్తులపైనా.. డబ్బులపైనా ఎలాంటి వ్యామోహం లేదన్నారు. తన కుటుంబంలో కేవలం ముగ్గురుమే ఉన్నామని, ఉన్నంతలో ఎంతో హాయిగా బతుకుతున్నట్లు తెలిపారు.

గతంలో తనపేరుతో కొందరు భూ సెటిల్ మెంట్లకు పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని వెంటనే ఆ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. వారిని అరెస్ట్ చేసినట్లు కూడా సభలో తెలియజేశారు. తనకు విశాఖలో స్థిరపడాలనే కోరికగా ఉందని, భీమిలిలోని నాలుగెకరాల వ్యవసాయ భూమిలో ఇంటిని నిర్మించుకుని ఉంటానని చెప్పుకొచ్చారు. విశాఖలోనే తనువు చాలిస్తానని కూడా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story