- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వీహెచ్‌ను బెదిరించిన కమల్ అరెస్ట్.. కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
దిశ, శేరిలింగంపల్లి : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావును దూషించడనే ఆరోపణలతో వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త కమల్‌ను రాయదుర్గం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తనను దూషించడంతో పాటు చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు వి.హన్మంత రావు రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా కమల్ ను వరంగల్ లో అదుపులోకి తీసుకుని, రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డిని, వీహెచ్ విమర్శించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమల్.. వీహెచ్ కు ఫోన్ చేసి దూషించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్ జిల్లాకు చెందిన కమల్ సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్త అని తెలుస్తోంది. పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్న కమల్ ను అరెస్ట్ చేయడంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల్ ను వెంటనే రిలీజ్ చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.