జహీరాబాద్ లో న్యాయవాది పై దాడి.. విధులు బహిష్కరించిన న్యాయవాదులు

by Kalyani |
జహీరాబాద్ లో న్యాయవాది పై దాడి.. విధులు బహిష్కరించిన న్యాయవాదులు
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాది సయ్యద్ ఎజాజ్ పై దాడిని ఖండిస్తూ అసోసియేషన్ సభ్యులు సోమవారం విధులను బహిష్కరించారు. ఆయనపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం న్యాయవాది హత్య ను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరుతూ.. హత్యకు కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.గోపాల్, గోపాల్(కృష్ణ) సీనియర్ న్యాయవాదులు ఎం.పాండురంగారెడ్డి , అశోక్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed