- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సు ప్రీం కోర్టులో శ్రవణ్ కుమార్‌కు ఊరట

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కాగా వారిని భారత్ రప్పించేందుకు తెలంగాణ పోలీసులు కేంద్ర హోంశాఖ తో కలిసి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించగా.. తాజాగా ఈ రోజు శ్రవణ్ రావు (Sravan Rao)కు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించగా.. ఈ రోజు విచారణ జరిపిన కోర్టు.. శ్రవణ్ రావు పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ (Providing protection from arrest) సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు కోర్టు సూచించింది.
తెలంగాణలో సంచలనంగా మారిన ఈ కేసు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) చుట్టూ తిరుగుతుంది. 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. ఇందులో SIB మాజీ OSD టి. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతనితో పాటు DSP దుగ్యాల ప్రణీత్ రావు, అదనపు SP భుజంగ రావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ OSD రాధాకిషన్ రావు, ఓ మీడియా సంస్థకు చెందిన శ్రవణ్ కుమార్ లు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఏ 1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రావణ్ రావులు విదేశాలకు వెళ్లిపోగా.. వారిని భారత్ రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మిగిలిని నింధితులను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించగా ప్రస్తుతం వారంత మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.