‘వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీ’ని ఎందుకు తీసుకురారు : ఎంపీ రేవంత్ రెడ్డి

by vinod kumar |   ( Updated:2021-04-23 04:53:45.0  )
‘వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీ’ని ఎందుకు తీసుకురారు : ఎంపీ రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.రోజువారీగా కరోనా రక్కసి బారిన పడి దేశంలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆక్సిజన్, వ్యాక్సిన్ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ‘వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీ’ని ఎందుకు తేవడం లేదని మండిపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను కేంద్రం తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కోరారు.

పీఎం కేర్ ఫండ్ ద్వారా కరోనా రోగులకు వైద్య పాలసీ ఇవ్వాలని చెప్పారు. రూ.5లక్షల వరకు వైద్యం సాయం అందేలా కేంద్రం కొత్త పాలసీని తీసుకురావాలని ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలను కరోనా చికిత్సకు వినియోగించాలన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డ్యాష్ బోర్డు ఎక్కడుందని ఈ సందర్భంగా రేవంత్ ప్రశ్నించారు. మెడికల్ డైరెక్టర్ ఓ మాట.. వైద్య మంత్రి మరో మాట మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story